Thu Mar 19 2026 00:10:26 GMT+0530 (India Standard Time)
మరో రికార్డ్ బ్రేక్ చేసిన జగన్

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మరో రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ఆయన పాదయాత్ర 2700 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. జగన్ పాదయాత్ర ఇవాళటికి 234వ రోజుకు చేరింది. తుని నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం తుని పట్టణంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. కొత్త వేలంపేల, సీతయ్యపేట, లోవకొత్తూరు, తాల్లూరు జంక్షన్, జగన్నాధగిరి ప్రాంతాల్లో ఇవాళ జగన్ నడుస్తున్నారు.
Next Story

