జగన్ కొత్త తరహా వ్యూహానికి దిగనున్నారా ...?

తెలుగుదేశం పార్టీ పై మరింత ఒత్తిడి పెంచేందుకు వైసిపి వ్యూహం రచిస్తోంది. రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేసిన వైసిపి పార్లమెంట్ సభ్యులు ఆసుపత్రి నుంచి రీలిజ్ అయిన వెంటనే రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ను కలిశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏవి ఎన్డీయే సర్కార్ అమలు కు ప్రయత్నం చేయక పోవడాన్ని వారు వివరించారు. అనంతరం వారు హైదరాబాద్ బయల్దేరారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని సవాల్ విసిరారు.
ఎంపీలతో జగన్ కీలక భేటీ ...
హోదా ఉద్యమం , విభజన హామీలు పై వైసిపి అధినేత జగన్ మరో వ్యూహానికి పదును పెట్టనున్నారు, హోదా ఉద్యమాన్ని గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని ఇప్పటికే నిర్ణయించారు. పాదయాత్రలో ఉన్నప్పటికీ జగన్ తన ఎంపీలతో కృష్ణా జిల్లాలో కీలక భేటీ తలపెట్టారు. ఇందులోనే తన పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలతో పాటు సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. జగన్.. వైసిపి మరో కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. అది ఎలా వుండబోతుందా అన్నది హాట్ టాపిక గా మారింది.
