Tue Mar 24 2026 01:36:36 GMT+0530 (India Standard Time)
జగన్ లాంగ్వేజీపై ఏకంగా పుస్తకమే

వైసీపీ అధినేత జగన్ ఉపయోగిస్తున్న భాషను అందరికీ తెలియజేస్తూ ఏకంగా ఒక పుస్తకమే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. వైసీపీ అధినేత జగన్ గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించిన పదాలన్నింటినీ కలిపి ఒక బుక్ లెట్ ను సిద్ధం చేయాలని టీడీపీ నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.జగన్ వాడుతున్న భాష సంస్కారవంతంగా లేదని తెలియజెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద జగన్ తన ప్రసంగాల్లో వాడిని అభ్యంతరకరమైన పదాలన్నీ ఒక పుస్తకరూపంలో తేవడానికి టీడీపీ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి. జగన్ నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా, పాదయాత్రలో వాడిన పదజాలాన్ని ఈ బుక్ లెట్ లో పొందుపర్చనున్నారు.
Next Story

