Sun Feb 01 2026 18:32:19 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడలో జగన్ జోరు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర బుధవారం కాకినాడ రూరల్, సిటీ నియోజకవర్గాల్లో సాగింది. నగరం మొత్తం వైసీపీ జెండాలు, జగన్ కటౌట్ లతో నిండిపోయింది. కాకినాడ నగరంలో నిర్వహించిన బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... అబద్దాలు ఆడటంలో చంద్రబాబు ముందుంటారని, ఇంకా ఇటుక కూడా పడని అమరావతిపై గొప్పలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంకు వచ్చిందంటున్నారని, కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి 14 స్థానాలు కట్టబెట్టినా సంతలో పశువుల మాదిరిగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. కాకినాడను స్మార్ట్ సిటీ చేస్తామని స్మార్ట్ గా అవినీతి చేశారని పేర్కొన్నారు.
Next Story

