Tue Mar 24 2026 04:39:52 GMT+0530 (India Standard Time)
సాయంత్రం వరకూ కోర్టులోనే జగన్

సాయంత్రం వరకూ జగన్ కోర్టులోనే ఉన్నారు. ఈరోజు జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రధానంగా వాన్ పిక్ కేసులో జగన్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై ఈరోజు వాదనలు సుదీర్ఘంగా సాగాయి. దీంతో సాయంత్రం వరకూ జగన్ కోర్టులోనే ఉండాల్సి వచ్చింది. ప్రతి శుక్రవారమూ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. జగన్ తోపాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. జగన్ హైదరాబాద్ నుంచి తిరిగి గుంటూరు జిల్లాలలో పాదయాత్ర నిలిపివేసిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు.
Next Story

