Mon Feb 02 2026 18:49:50 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు మహిళల సన్మానం

తూర్పు గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నందున ఆయన గురువారం మద్యాహ్నానికి పాదయాత్ర ముగించుకుని బయలుదేరారు. అంతకుముందు జగన్ ను కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలు కలిసి సన్మానించారు. కాపు కార్పొరేషన్ కు పది వేల కోట్ల నిధులు ఇస్తామని జగన్ హామీ ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
Next Story

