Tue Mar 24 2026 02:11:20 GMT+0530 (India Standard Time)
విషం లేదు... అల్యూమినియం ఉంది

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై దాడిచేసిన కత్తికి విషం లేదని వైద్యులు తేల్చారు. ఇవాళ వారు జగన్ ను మరోసారి పరీక్షించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ... జగన్ రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వచ్చాయని... విషం ఆనవాళ్లు లేవని, రక్తంలో అల్యూమీనియం ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. ఇందుకు కూడా చికిత్స చేస్తున్నామన్నారు. అయితే, జగన్ గాయం తీవ్రతకు సంబంధించి వస్తున్న ఆరోపణలను వైద్యులు కొట్టేశారు. బుల్లెట్ గాయం జరిగితే గాయం పరిణామం చిన్నదైనా నష్టం పెద్దగా ఉంటుందన్నారు. ఒక్కోసారి గాయం పరిణామం పెద్దగా ఉన్నా కేవలం చర్మానికే గాయం జరిగితే నష్టం ఉండదన్నారు. ప్రస్తుతం చర్మానికి వేసిన కుట్లు మానుతున్నాయని, అయితే, లోపల మాంసం గాయం మానాలంటే మాత్రం ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు జగన్ చేతికి కొంత విశ్రాంతి ఇవ్వాలని వారు సూచించారు.
Next Story

