Mon Mar 23 2026 17:01:24 GMT+0530 (India Standard Time)
జగన్ హెల్త్ బులిటెన్ విడుదల

హత్యాయత్నానికి గురైన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సిటి న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. జగన్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. కత్తి బలంగా శరీరంలోకి దిగిందని, ఆయనకు తొమ్మిది కుట్లు వేశామని తెలిపారు. జగన్ రక్త నమూనాను ల్యాబ్ కి పంపించి పరీక్షిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వచ్చాక జగన్ ను రేపు ఆసుపత్రి నుంచి డిస్చార్జి చేయనున్నట్లు తెలిపారు.
Next Story

