Mon Feb 02 2026 10:43:36 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఫ్లెక్సీలు తొలగింపు

తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఫ్లేక్సీలను అధికారులు తొలగిస్తున్నారు. జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అయితే, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారని ఆర్ ఆండ్ బీ అధికారులు వాటిని తొలగించారు. అయితే, ఫ్లెక్సీల తొలగింపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎక్కడా లేని నిబంధనను మాకే ఎందుకు పెట్టారని వారు ప్రశ్నించారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
Next Story

