Tue Mar 24 2026 00:07:09 GMT+0530 (India Standard Time)
ఓటుకు ఐదువేలు ఇస్తారు..తీసుకోండి

వచ్చే ఎన్నికల్లో బాబు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తానంటారని, బోసస్ గా బెంజి కారు ఇస్తారంటారని, చంద్రబాబు మాటలను నమ్మవద్దని వైసీపీ అధినేత జగన్ కోరారు. మైలవరంలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటుకు ఐదువేలు ఇస్తారని, అవి తీసుకుని మీ మనస్సాక్షి ప్రకారమే ఓటు వేయాలన్నారు. అబద్ధాల కోరు చంద్రబాబు మాటలను నమ్మవద్దని జగన్ తెలిపారు. జగన్ బాబు పుట్టిందే 420 రోజని సెటైర్ వేశారు. ఆయన ఏప్రిల్ 20వ తేదీన జన్మించారని, దీనిని 420 కాక మరేమంటారన్నారు. ఆయన పుట్టిన రోజున ఒకరోజు దీక్ష చేస్తారట అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన రోజే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణదీక్ష చేసి ఉంటే దేశం మొత్తం దీనిపై చర్చించి ఉండేది కాదా? ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా? అనిజగన్ ప్రశ్నించారు.
Next Story

