Mon Mar 23 2026 15:27:38 GMT+0530 (India Standard Time)
జగన్ అభిమానుల ఆందోళన... ట్రిఫిక్ లో టీమిండియా క్రికెటర్లు

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దాడి విషయం తెలియగానే పెద్దఎత్తున విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరిన జగన్ అభిమానులు ఆందోళనకు దిగారు. హైవేపై ధర్నాకు దిగడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. నిన్న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ ఆడటానికి వచ్చి తిరిగి వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు వస్తున్న టీమిండియా క్రికెటర్లు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

