Mon Mar 23 2026 18:37:27 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్

హత్యాయత్నానికి గురై హైదరాబాద్ సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న సాయంత్రం ఆయన ఆసుపత్రిలో చేరగా వైద్యులు గాయం జరిగిన ఎడమ చేతికి శాస్త్ర చికిత్స చేశారు. డాక్టర్లు 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని చెప్పినా... ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉండటంతో ఆయన డిశ్చార్జ్ అయ్యేందుకే మొగ్గు చూపారు. ఆయన ఆసుపత్రి నుంచి లోటస్ పాండ్ కి వెళ్లనున్నారు. అయితే, భూజానికి 3 అంగుళాల లోతు గాయం కావడంతో పాదయాత్రలో ప్రజలను ఎక్కువగా కలిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి కనీసం వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Next Story

