Sun Mar 22 2026 07:20:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్

విజయనగరం జిల్లాలో పాదయాత్రకు భారీ స్పందన వస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త జోష్ తో ఉన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని మూడు లాంతర్ల సెంటర్ లో భారీ సభ జరిగింది. ఈ సభలో విజయనగరం జిల్లాలో తొలి అభ్యర్థిని జగన్ ప్రకటించిన సంచలనానికి తెరలేపారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని ఆయన విజయనగరం స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. స్వామి మంచి వాడని, సౌమ్యుడని, ఆయన విజయనగరానికి, ఇక్కడి ప్రజలకు మంచి చేస్తాడన్న నమ్మకం తనకుందని స్పష్టం చేశారు. వీరభద్రస్వామికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తనకు ప్రజల దీవెనలు అవసరమని వ్యాఖ్యానించారు.
Next Story

