Thu Mar 19 2026 23:12:15 GMT+0530 (India Standard Time)
జగన్ కు కితాబిచ్చిన కీలక నేత

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వై.ఎస్.జగన్ పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగా నిలదొక్కుకుందన్నారు. 2014లోనే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, పురందేశ్వరి బీజేపీలో ఉన్నా తాను మాత్రం ఏ పార్టీలో లేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత బాగా పెరిగిందని, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కనీసం రూ.20 - 25 కోట్లు పెట్టాల్సి వస్తుందన్నారు. తాను ఓట్లు కొనే సంస్కృతికి వ్యతిరేకమన్నారు. అమరావతిని మహానగరంగా మార్చడంలో తప్పేమీ లేదని, కానీ, వేల ఎకరాల్లో అవసరం లేదన్నారు. తెలంగాణలో ఎన్ని ఎకరాల్లో సచివాలయం ఉందో గుర్తుంచుకోవాలని కోరారు.
Next Story

