Mon Feb 02 2026 09:20:47 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కోర్టులో జగన్....!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శుక్రవారం కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ఆయన విరమం ఇచ్చిన ఆయన హైదరాబాద్ కి వచ్చారు. తిరిగి ఇవాళ సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుని రేపటి నుంచి యధావిధిగా పాదయాత్రను కొనసాగిస్తారు.
Next Story

