Mon Feb 02 2026 20:15:02 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కోర్టుకు జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన మళ్లీ ఇవాళ సాయంత్రం బయలుదేరి పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి చేరుకోనున్నారు. రేపటి నుంచి పాదయాత్ర యధావిధిగా జరగనుంది. జగన్ ను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు హైదరాబాద్ వచ్చారు. కొందరు లోటస్ పాండ్ లో ఆయనను కలుసుకోగా, ముఖ్యనేతలు కోర్టు వద్ద కలసి మాట్లాడారు.
Next Story

