Sun Mar 22 2026 05:46:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ మరో కఠిన నిర్ణయం

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ ఎంతటి కఠిన నిర్ణయాలను తీసుకోవడానికైనా వెనకడుగు వేయడం లేదు. బలమైన అభ్యర్థుల వేటలో ఉన్న ఆయన పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జిలను మార్చి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఇంఛార్జి మర్రి రాజశేఖర్ స్థానంలో విడదల రజని ని నియమించారు. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇంతకాలం సమన్వయకర్తగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో ఏసురత్నం ను నియమించారు. నియమించారు. ఈ నిర్ణయం పట్ల అప్పిరెడ్డి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేయాలని అప్పిరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.
Next Story

