Sun Mar 22 2026 15:29:02 GMT+0530 (India Standard Time)
మరో మైలురాయి చేరిన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర మరో మైలురాయి చేరింది. జగన్ పాదయాత్ర ఇవాళ 281వ రోజు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగింది. ఇవాళ ఆనందపురం క్రాస్ వద్ద ఆయన పాదయాత్ర 3100 కిలోమీటర్ల మైలురాయి చేరింది. దీంతో అక్కడ జగన్ ఒక వేప మొక్కను నాటారు. జగన్ యాత్ర ఇవాళ కలవచర్ల, కోటగండ్రేడు, పాలవలస క్రాస్, ఆనందపురం క్రాస్ మీదుగా గరికవలస వరకు కొనసాగింది.
Next Story

