Sun Mar 22 2026 07:14:43 GMT+0530 (India Standard Time)
జగన్ విజయనగరం సభకు ఆటంకం..!

విజయగనరంలోని మూడు లాంతర్ల సెంటర్ లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సభకు ఆటంకం ఎదురైంది. నగరంలో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. జగన్ సభ జరిగే సమయంలోనూ కరెంటు లేదు. దీంతో జగన్ ప్రసంగం ముగిసే సమయానికి చీకటి అలుముకుంది. సభ పూర్తి కాగానే మళ్లీ కరెంటు వచ్చింది. అయితే, టీడీపీ నేతలే కరెంటు నిలిపివేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ నిలిపివేయడంపై జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది ప్రజలు ఒక్కచోట చేరినప్పుడు విద్యుత్ నిలిపివేయడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story

