మరోసారి జేసీ చిందులు

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి చెలరేగిపోయారు. సొంత పార్టీ నేతలను, మంత్రులను తీవ్ర పదజాలంతో దూషించారు. తెలుగుదేశం పార్టీకి చెందని ఎమ్మెల్యేలు, మంత్రులు పనికిరాని దద్దమ్మలుగా ఆయన అభివర్ణించారు. అనంతపురం జిల్లాలో జరిగిన రైతు సదస్సులో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అలాగే కమ్యునిస్టులపై కూడా జేసీ కన్నెర్ర చేశారు. కమ్యునిస్టులు పనికిరాని వాళ్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సరిగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అమలు చేయడం లేదన్నారు.
తనకు మంత్రి పదవి ఇస్తే.....
తనకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడని తెలుసని, ఇస్తే ఆయనకే ఇబ్బంది అని జేసీ చిందులు తొక్కారు. చంద్రబాబు వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని కూడా ఆయన అన్నారు. జేసీ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు నివ్వెర పోయారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సొంత పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులనే వేదికపై తిట్టిపోయడాన్ని కొందరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
- Tags
- ananthapuram district
- andhra pradesh
- ap politics
- communists
- J.C.Divakar reddy
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అనంతపురం జిల్లా
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కమ్యునిస్టులు
- జనసేన పార్టీ
- జేసీ దివాకర్ రెడ్డి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
