Thu Mar 19 2026 00:11:19 GMT+0530 (India Standard Time)
మళ్లీ మోదీయే ప్రధాని....ఎంపీ జేసీ జోస్యం...!

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమయమంతా నిరసనలకే సరిపోయిందని, ప్రజాసమస్యలను సభలో చర్చించలేకపోయామన్నారు. నిరసనల వల్ల ఉపయోగం ఏమీ ఉండదని తమకు తెలిసినా చేయాల్సి వచ్చిందన్నారు. నరేంద్రమోదీ మాట వినే రకం కాదని, ఏపీ సమస్యలను ఆయన పరిష్కరించరని తాను తొలి నుంచి చెబుతున్నానని జేసీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే కొంత బలం తగ్గినా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని, కాంగ్రెస్ పార్టీ మరింత బలం పెంచుకోవాలని జేసీ అభిప్రాయపడ్డారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha pary
- indian national congress
- J.C.Divakar reddy
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- జేసీ దివాకర్ రెడ్డి
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

