Mon Mar 23 2026 11:50:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ :రేపు విశాఖలో ఐటీ దాడులు?

రేపు విశాఖలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. తెలంగాణ, ఒడిశా, చెన్నై, బెంగళూరు నుంచి భారీ సంఖ్యలో ఐటీ అధికారులు విశాఖకు చేరుకున్నారు. విశాఖలోని పలు హోటళ్లలో ఇప్పటికే వీరు బస చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్న అధికారులు గురువారం తెల్లవారుఝామునుంచే దాడులు జరుపుతారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఐటీ దాడులు ఎవరి మీద జరుగుతాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇటీవలే విజయవాడలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.
Next Story

