Mon Mar 23 2026 03:26:05 GMT+0530 (India Standard Time)
ఐటీ దాడులు ఇంకా జరుగుతాయన్న బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని బీజేపీ శానసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సీఎం రమేష్ పై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తుందనడం హాస్యాస్పదమని, నాలుగేళ్లు ఎవరెవరు ఏమేం చేశారో అందరికీ తెలుసన్నారు. ఐటీ దాడులు సర్వసాధారణమని, పార్టీకు వీటితో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రానికి పన్నులు ఎగ్గొడితే కేంద్ర సంస్థలు, రాష్ట్రానికి పన్ను ఎగ్గొడితే రాష్ట్ర శాఖలు దాడులు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
Next Story

