Sat Mar 21 2026 23:50:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేవంత్ కు ఐటీ అధికారుల ఫోన్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవంత్ రెడ్డికి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఫోన్ చేశారు. ఉదయం నుంచి హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి, ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇవాళే కొడంగల్ లో భారీ ఎత్తున రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. ఐటీ దాడుల విషయం తెలిసినా ప్రచారాన్ని కొనసాగించారు. దీంతో ఐటీ అధికారులు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ రావాలని చెప్పడంతో ఆయన ప్రచారం ఆపేసుకుని హైదరాబాద్ కి బయలుదేరారు.
Next Story

