Sun Mar 15 2026 16:46:30 GMT+0530 (India Standard Time)
అప్పుడే నిర్ణయిద్దాం.. ఇప్పుడప్పుడే వద్దు
తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై స్పష్టత ఇంకా రాలేదు. బీజేపీ, జనసేనలు కలసి సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిరుపతి [more]
తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై స్పష్టత ఇంకా రాలేదు. బీజేపీ, జనసేనలు కలసి సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిరుపతి [more]

తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై స్పష్టత ఇంకా రాలేదు. బీజేపీ, జనసేనలు కలసి సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికపై చర్చ జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎవరు పోటీ చేయాలన్న దానిపై నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. అప్పటి వరకూ బీజేపీ, జనసేనలు కలసి పోటీ చేస్తాయన్న ప్రచారాన్ని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఢిల్లీ పెద్దల సూచనల మేరకు ఎవరు పోటీ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుందామని సమావేశంలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో బీజేపీ నుంచి సునీల్ దియోధర్, సోము వీర్రాజు, జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లు పాల్గొన్నారు.
Next Story

