Sat Mar 21 2026 12:32:15 GMT+0530 (India Standard Time)
బెట్టింగ్ కలకలం..హీరో తమ్ముడికి నోటీసులు

ఐపీఎల్ లో బెట్టింగ్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఐపీఎల్ లో బెట్టింగులు నిర్వహించే బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ కు ముంబాయిలోని థానే పోలీసులు నోటీసులు ఇచ్చారు. పూర్తిగా డబ్బుల ఆటగా మారిపోయిన ఐపీఎల్ లో బెట్టింగ్ ఆరోపణలు కొత్త కాదు. గత రెండేళ్ల క్రితం కూడా స్పాట్ ఫిక్సింగ్ తో ఐపీఎల్ ప్రతిష్ఠ మసకబారింది. ఇప్పుడు కూడా కేవలం అర్బాజ్ ఖానేనా, ఇంకెవరైనా సెలబ్రిటీలు బెట్టింగ్ ఆరోపణల్లో ఉన్నారా తేలాల్సి ఉంది.
Next Story

