Sat Mar 21 2026 07:20:45 GMT+0530 (India Standard Time)
భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు..!

భారత్ లోని ఐఫోన్ అభిమానులకు శుభవార్త చెప్పింది యాపిల్ సంస్థ. మార్కెట్లలో ఉన్న ఐఫోన్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ధరలు తగ్గించిన వాటిలో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్ కూడా ఉన్నాయి. ఐఫోన్ 6 ఎస్ ప్లస్(32జీబీ) ధర ప్రస్తుతం రూ.52,240 ఉండగా దాని ధరను రూ.34,900కి తగ్గించారు. ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128 జీబీ) ప్రస్తుత ధర రూ.61,450 కాగా ఇప్పుడు రూ.44,900కి తగ్గించారు. ఐఫోన్ బేసిక్ మోడల్ ను రూ.29,900కు, హైఎండ్ మోడల్ 39,900కి తగ్గింది. రూ.95,390 ఉన్న ఐఫోన్ క్స్ ధర ఇప్పుడు రూ.91,900కి చేరింది. ప్రస్తుతం రూ.77,560 ఉన్న ఐఫోన్ 8 ప్లస్(64జీబీ) ధర రూ.69,900కి తగ్గింది. ఐఫోన్ 7(32 జీబీ) 39,900కి, ఐఫోన్ 7(128 జీబీ) ధర రూ.49,900కి తగ్గించారు.
Next Story

