Fri Feb 14 2025 11:21:46 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : ఎండలు ముదిరిపోయాయి.. బయటకు రాకపోవడమే బెటర్
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావడానికి భయపడిపోతున్నారు. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయిని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కర్ఫ్యూ వాతావరణం అప్పుడే...
ఎండల తీవ్రత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కావడంతో ఇక మే నెలలో ఎంత స్థాయిలో ఎండలు ఉంటాయన్నది అర్థం కాకుండా ఉంది. నిన్నటి వరకూ చలితో ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా ఉక్కపోతతో అలమటిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచే ఎండల తీవత్ర అధికంగా ఉంది. వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాత్రి ఏడు గంటల వరకూ ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గకపోవడంతో హైదరాబాద్ నగరంలో అనేక రహదారులు మధ్యాహ్నానికి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఈసారి వేసవిలో...
ఈసారి సమ్మర్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే 35నుంచి 36 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అదే సమయంలో ఏపీలో కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story