ఢిల్లీలోనే తేల్చుకుంటాం....!

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. రాహుల్ గాంధీని కలిసి పదవుల పంపకం, ఉత్తమ్ వ్యవహార శైలిపై చర్చించనున్నట్లు సమచారం. నిన్న సీఎల్పీ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుండానే నిన్న సమావేశమైన సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, శ్రీధర్ బాబు తదితరులు సమావేశమై చర్చించారు. కేసీఆర్ ను ఎదుర్కొనాలంటే ధీటుగా ఎదుర్కొనాలని భావిస్తున్నారు.
నేడు రాహుల్ ను కలిసి......
ఈరోజు రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలసి శుభాకాంక్షలు చెప్పి పనిలో పనిగా రాష్ట్ర పరిస్థితులను రాహుల్ కు వివరించాలని నిర్ణయించుకన్నారు. అయితే ఉత్తమ్ మాత్రం కాంగ్రెస్ లో ఎటువంటి విభేదాలు లేవని, అంతా సజావుగానే ఉందని చెబుతున్నారు. మొత్తం మీద సీనియర్ నేతలు ఉత్తమ్ మీద గుస్సా గా ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతల ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతుంది.
