Sat Mar 21 2026 13:36:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు మరో షాక్
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి కమల్ నాధ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 52 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. [more]
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి కమల్ నాధ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 52 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. [more]

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి కమల్ నాధ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 52 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 40 మంది మాత్రమే కమల్ నాధ్ సమావేశానికి హాజరయ్యారు. దీంతో కమల్ నాధ్ కు భారీ షాక్ ఇచ్చారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే గవర్నర్ ను కలసిన కమల్ నాధ్ జ్యోతిరాదిత్య సింధియా వర్గంలో చేరిపోయిన 6 మంది మంత్రులను తొలగించాలని కోరారు. తాజాగా అత్యవసర సమావేశానికి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో కమల్ నాధ్ పూర్తిగా చేతులెత్తేసినట్లయింది.
Next Story