తేజస్ 2.0 రాకతో భారత ఎయిర్ ఫోర్స్ మరింత పటిష్టం
భారత వైమానిక దళం మరింత పటిష్టంగా మారేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది.

భారత వైమానిక దళం మరింత పటిష్టంగా మారేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. తేలికరకం యుద్ధ విమానం తేజస్ కు చెందిన అత్యాధునిక ఎంకే1–ఏ వేరియంట్ జూన్ నెలాఖరుకల్లా ఎయిర్‌ఫోర్స్ అమ్ములపొదిలోకి చేరనుంది. దశలవారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థగా పేరుంది.
రఫేల్ యుద్ధ విమానాల్లోని రాడార్ గైడెడ్ డెర్బీ క్షిపణులను తేజస్ఎంకే1–ఏకు అమర్చనున్నారు. మిగ్–21, జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్‌లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని 42కు పెంచుకోవాలన్నది భారత్ లక్ష్యం.

