Sat Mar 28 2026 04:24:00 GMT+0530 (India Standard Time)
వన్డే కాదిది.. ట్వంటీ ట్వంటీ మ్యాచ్
ఇండియా - శ్రీలంకల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది

ఇండియా - శ్రీలంకల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. 317 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. వన్డే చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయంగా చెప్పాలి. మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకుని శ్రీలంకను కుప్పకూల్చాడు. షమీ రెండు వికెట్ ను తీసుకున్నాడు. 391 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ను ప్రారంభించిన శ్రీలంక ఆది నుంచి తడబడుతూనే ఉంది. ఇరవై ఓవర్లలోనే కథ ముగించారు.
భారీ పరుగుల తేడాతో...
ఏ ఒక్క బ్యాటర్ నిలకడగా రాణించలేకపోయారు. కనీసం వంద పరుగులు కూడా చేయలేక శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. వరసగా పెవిలియన్ పడతుండటంతో అలా వచ్చి అలా వెళ్లిపోయారడు. కులదీప్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లి 166 పరుగులు చేసి తన బ్యాట్ లో చేవతగ్గలేదని నిరూపించాడు. శుభమన్ గిల్ 116 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో మూడు వన్డే మ్యాచ్ లను శ్రీలంకపై భారత్ గెలిచి వైట్ వాష్ చేసేసింది.
Next Story

