Mon Mar 23 2026 07:31:20 GMT+0530 (India Standard Time)
అది కత్తా....? బ్యాటా....?

ఇండియా గెలిచింది. వెస్ట్ ఇండీస్ పై తొలి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 322 పరుగుల లక్ష్య సాధనలో దిగిన టీం ఇండియా అలవోకగా గెలిచింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్బ్ బ్యాటింగ్ భారత్ కు సునాయసంగా విజయం దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కత్తి దూసినట్లు బ్యాట్ ను ఝుళిపించి 140 పరుగులు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ 152 పరుగులు సాధించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మధ్య భాగస్వామ్యమం 242 పరుగులు రికార్డు పార్ట్ నర్ షిప్ చేజిక్కించుకుంది. తొలి ఓవర్లలోనే శిఖర్ ధావన్ అవుట్ అవ్వడంతో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. కోహ్లీ బ్యాట్ ధాటికి విండీస్ బౌలర్లు చేతులెత్తేశారు. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.
Next Story

