Thu Dec 18 2025 09:17:39 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : డబుల్ సెంచరీ చేసిన శుభమన్ గిల్
భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇండియా భారీ స్కోరు సాధించింది. శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేశారు

భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇండియా భారీ స్కోరు సాధించింది. శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేశారు. ఓపెనర్ గా దిగిన శుభమన్ గిల్ సిక్స్ లు, ఫోర్లతో ఉప్పల్ స్టేడియంలో మోత పుట్టించాడు. సీనియర్ ఆటగాళ్లు విఫలమయినా శుభమన్ గిల్ క్రీజ్ కు అతుక్కుపోయి ఆడటంతో భారత్ కు భారీ స్కోరు లభించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలు గౌరవ ప్రదమైనస్కోరు చేశారు.
న్యూజిలాండ్ లక్ష్యం...
శుభమన్ గిల్ 149 బాల్స్ లో 208 పరుగులు చేశాడు. భారత్ ఏడు వికెట్లు కోల్పోయి పరుగులు సాధించింది. గిల్ ధాటికి స్టేడియం దద్దరిల్లి పోయింది. ఓపెనర్ గా వచ్చిన శుభమన్ గిల్ చివరి ఓవర్ ఓవర్లో రెండు బంతుల వరకూ క్రీజులో ఉన్నారు. భారీ షాట్ కు యత్నించి అవుటయ్యాడు. యాభై ఓవర్లలో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 349 పరుగుల చేసింది. న్యూజిలాండ్ లక్ష్యం 35ేగా నిర్దేశించింది.
- Tags
- india
- new aealand
Next Story

