Mon Mar 23 2026 03:27:38 GMT+0530 (India Standard Time)
ఐటీ తీసిన ప్రాణం

ఆదాయపు పన్ను శాఖ అధికారులు విధించిన జరిమానా చెల్లించలేక మహ్మద్ సాధిక్ అనే వ్యాపారి ఆత్మహత్య విజయవాడలో సంచలనం సృష్టించింది. విజయవాడలోని సనత్ నగర్ కు చెందిన మహ్మద్ సాధిక్ ఆటోనగర్ లో లారీలకు బాడీ బిల్డింగ్ వర్క్స్ చేస్తుంటాడు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఐటీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న సాధిక్ 50 లక్షల జరిమానా విధించింది ఐటీశాఖ. ఐటీ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవడంతో బందరు కాల్వలో దూకి సాధిక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఐటీ అధికారుల వేధింపుల వల్లనే సాధిక్ సాధిక్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Next Story

