Thu Mar 26 2026 02:40:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కొడంగల్ లో ఐటీ సోదాల కలకలం

కొడంగల్ లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువుగా భావిస్తున్న జగన్నాధరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో పెద్దమొత్తంలో నగదు బయట పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కూడా ధృవీకరించారు. ఈ సోదాల్లో పెద్దయెత్తున నగదు బయటపడినట్లు సాచారం. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఇళ్లల్లో సోదాలు జరిగాయని, ఐటీ శాఖ అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాల్సి ఉందని రజత్ కుమార్ తెలిపారు. ఐటీ నుంచి సమాచారం రేపు వస్తుందని అప్పడు పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
Next Story

