Mon Mar 23 2026 23:12:29 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఆగని ఐటీ దాడులు...టీడీపీ నేత ఇంట్లో....?

ఆంధ్రప్రదేశ్ లో ఆదాయపుపన్ను శాఖ దాడులు ఆగలేదు. గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని, తమ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు కేంద్ర ప్రభుత్వం చేయిస్తుందని ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢీల్లీ వేదికగా నినదించిన రెండో రోజే గుంటూరులో ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం నాయకుడు కోవెల మూడి రవీంద్ర ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోవెలమూడి రవీంద్ర గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శిగా ఉన్నారు. మరికొన్ని చోట్ల కూడా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story

