Fri Jan 02 2026 04:21:39 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ వైసీపీ నేత సస్పెన్షన్.. ఎందుకంటే?
విశాఖలో వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విజయసాయిరెడ్డి పేరు చెప్పి భూదందాకు పాల్పడటంతోనే కొయ్య ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు [more]
విశాఖలో వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విజయసాయిరెడ్డి పేరు చెప్పి భూదందాకు పాల్పడటంతోనే కొయ్య ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు [more]

విశాఖలో వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విజయసాయిరెడ్డి పేరు చెప్పి భూదందాకు పాల్పడటంతోనే కొయ్య ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన వెంటనే భూముల ధరలు పెరిగిపోయాయి. అయితే తొలి నుంచి వైసీపీలో ఉన్న కొయ్య ప్రసాద్ రెడ్డి ఒక వ్యక్తి నుంచి తక్కువ ధరకు విజయసాయిరెడ్డి పేరు చెప్పి కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కొయ్య ప్రసాద్ రెడ్డి ప్రమేయం ఉందని తెలియడంతో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది.
Next Story