చిట్ ఫండ్స్ పేరుతో భారీ మోసం.. 15కోట్ల తో పరారీ
హైదరాబాద్ పాతబస్తీలో అంజలి అనే మహిళ చిట్ ఫండ్స్ పేరుతో మోసం చేసింది.15 కోట్లరూపాయలతో ప్రజలకు నమ్మకంగా మోసం చేసింది. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ [more]
హైదరాబాద్ పాతబస్తీలో అంజలి అనే మహిళ చిట్ ఫండ్స్ పేరుతో మోసం చేసింది.15 కోట్లరూపాయలతో ప్రజలకు నమ్మకంగా మోసం చేసింది. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ [more]

హైదరాబాద్ పాతబస్తీలో అంజలి అనే మహిళ చిట్ ఫండ్స్ పేరుతో మోసం చేసింది.15 కోట్లరూపాయలతో ప్రజలకు నమ్మకంగా మోసం చేసింది. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పటేల్ నగర్ జరిగింది. 85 మంది బాధితులతో కూడిన లిస్ట్ ను చాంద్రాయణగుట్ట ఇన్ స్పెక్టర్ రుద్రభాస్కర్ కు అందచేసినట్లు సమాచారం. భాదితులు దాదాపు 250 మంది వరకు ఉన్నట్టు సమాచారం. చిట్ ఫండ్స్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులతో ఉడా యించినట్లు చాంద్రాయణగుట్ట పోలీసులు ప్రాథమిక నిర్ధారణ కు వచ్చారు. అయితే బాధితులను సీసీఎస్ లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్న పోలీసులు. అయితే అంజలి కుటుంబం గత 25 ఏళ్లుగా పటేల్ నగర్ లో నివసిస్తుంది. ఆమె భర్త బాబురావు సిఆర్ పీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి. 25 ఏళ్ళ నుంచి నమ్మకంగా ఉంటుందని చిట్స్ వేసినట్లు బాధితులు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా ఇంటికి తాళం .. ఫోన్ రెస్పాన్స్ కూడా లేకపోవడంతో బాధితులు చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించారు.అయితే అంజలి చిట్ ఫండ్స్ తో పాటు పెద్ద మొత్తంలో తక్కువ ఇంట్రెస్ట్ కు కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

