Thu Mar 19 2026 13:52:13 GMT+0530 (India Standard Time)
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...

వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ తల్లి స్వంత కుమారుడినే కడతేర్చిన దారుణ సంఘటన విజయనగరంలో జరిగింది. స్థానిక గాయత్రినగర్ కు చెందిన వెంకట పద్మావతి కుమారుడు ముదునూరి హరి భగవాన్ పట్టణంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కుమారుడిని చంపాలని స్కెచ్ వేసిన కసాయి తల్లి ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి తినిపించింది. దీంతో హరి భగవాన్ నిద్రలోనే మృతి చెందాడు. పోలీసులు సదరు కసాయి తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story

