Mon Feb 02 2026 06:26:26 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో హైదరాబాదీ మిస్సింగ్

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడి ఆచూకీ తెలియడం లేదు. హైదరాబాద్ కి చెందిన మిర్జా అహ్మద్ అలీ బేగ్(26) 2015 జులైలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవడానికి అమెరికాలోని పెన్సెల్వేనియా వెళ్లాడు. అప్పటి నుంచి హైదరాబాద్ కి రాలేదు. ఒక సంవత్సరం తర్వాత న్యూజెర్సీలో వేరే విద్యాసంస్థలో చేరాడు. అయితే, గత శుక్రవారం ఇంటికి ఫోన్ చేసిన అహ్మద్ అలీ... తాను అమెరికాలో గత ఆరు నెలలుగా సమస్యల్లో ఉన్నానని మాత్రం చేప్పాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదు. తమ కుమారుడి ఆచూకీ తెలియజేయాలని అతడి తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఇండియన్ ఎంబసీని కోరుతున్నారు.
Next Story

