Wed Mar 18 2026 22:22:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్... హైదరాబాద్ లో కాల్పుల కలకలం

కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఓ కానిస్టేబుల్ ఏకే-47 తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ డీజీ ఆర్పీ మీనా వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్న కిషోర్ శుక్రవారం సాయంత్రం తనవద్ద ఉన్న ఏకే-47తో కాల్చుకున్నాడు. దీంతో ఆర్పీ మీనా కుటుంబసభ్యలు వెంటనే కిషోర్ ను అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని గన్, బుల్లెట్లు, బుల్లెట్ షెల్స్ స్వాదీనం చేసుకున్నారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.
Next Story

