Thu Mar 19 2026 07:37:46 GMT+0530 (India Standard Time)
అడ్డువచ్చిన వారందరిపై దాడిచేసి

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ సిరిమల్లె కాలనీలో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వ్యాపారవేత్త ఇంట్లో కి చొరబడ్డ దొంగలు అడ్డువచ్చిన వారిపై దాడి చేశారు. దీంతో రాజేంద్రప్రసాద్ అగర్వాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. 50 లక్షల నగదు, 40 తులాల బంగారం దోచుకెళ్లారు. ఇంట్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కుటుంబసభ్యులు ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story

