Tue Mar 24 2026 10:47:13 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో బాణాసంచా కాల్చే టైం ఇదే..!

దీపావళి రోజు రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లో బాణాసంచా కాల్చేందుకు పోలీసులు సమయం నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
Next Story

