Mon Mar 23 2026 00:31:30 GMT+0530 (India Standard Time)
మెట్రో రైలుకు బ్రేక్...

హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణం లో సాంకేతిక లోపంతో డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ రైలు నిలిచిపోయింది. ఎల్.బి.నగర్ నుండి మొదలైన రైలు మియపూర్ వరకు వెళ్లాలి. కానీ సాంకేతిక లోపంతో డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ బాలానగర్ స్టేషన్ లో నిలిచిపోయింది. దీంతో తమ గమ్యస్థానాలకు, ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తమ టిక్కెట్ డబ్బులు తమకు తిరిగి ఇవ్వడం లేదని, ఇచ్చినా తక్కువ ఇస్తున్నారని వాపోయారు.
Next Story

