Mon Mar 23 2026 09:08:55 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో మరో గ్యాంగ్ వార్

హైదరాబాద్ లో మరో గ్యాంగ్ వార్ జరిగింది. ఆదివారం అర్థరాత్రి జవహర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని జేజే నగర్ లో శ్రావణ్ అనే వ్యక్తిపై విక్కి, వికాస్ కుమార్, క్రిష్ణ, జోసఫ్ దాడికి ప్రయత్నించారు. దీంతో శ్రావణ్ కత్తితో వారిపై తిరగబడ్డారు. శ్రావణ్ దాడిలో విక్కి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు యశోధా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, అక్రమ సంబందం నేపథ్యంలో జరిగిన గొడవే ఈ దాడులకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
Next Story

