Thu Mar 19 2026 04:38:32 GMT+0530 (India Standard Time)
పరిపూర్ణానంద స్వామికి భారీ ఊరట

నగర బహిష్కరణకు గురైన కాకినాడ శ్రీ పీఠాదిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టు ఊరట లభించింది. నెల రోజుల క్రితం శ్రీరాముడిపై కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, దీనికి నిరసనగా పరిపూర్ణానంద యాదాద్రికి పాదయాత్ర కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ యాత్రను అడ్డుకున్న పోలీసులు ఆయనను గృహనిర్భందం చేశారు. మొదట కత్తి మహేష్ ను, ఆ తర్వాత పరిపూర్ణానంద స్వామిని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

