Wed Mar 18 2026 22:41:43 GMT+0530 (India Standard Time)
ఆంధ్రలో భారీ కుంభకోణం

విశాఖపట్నం జిల్లాలో భారీ భూకబ్జా వ్యవహారాన్ని సీపీఐ బయటపెట్టింది. విశాఖ, విజయనగరంలో జిల్లాల్లో సుమారు రూ.2,900 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని, తెలుగుదేశం పార్టీ నేతలు, కొందరు ప్రజాప్రతినిధుల బంధువుల హస్తం కూడా ఇందులో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మొదటి విడతగా ఆయన 10 మంది భూకబ్జాదారుల పేర్లు బయటపెట్టారు. వీరిలో మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి భాస్కర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పిల్లా సింహాచలం కుటుంబసభ్యులు కూడా ఉన్నారన్నారు. భూకబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంతకుముందు చేసిన సిట్ విచారణ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని, లేకపోతే మిగిలిన వారి పేర్లు కూడా తామే బయటపెడతామని స్పష్టం చేశారు.
Next Story

