Fri Mar 20 2026 02:58:51 GMT+0530 (India Standard Time)
అజ్ఞాత భక్తుడి భారీ విరాళం

తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తుల నుంచి విరాళాలు భారీగానే వస్తాయి. స్వామి వారి ఆలయం హుండీ ఆదాయమే రోజూ కోట్లలో ఉంటుంది. అయితే, ఇలా హుండీల్లో వేసేవారు, విరాళాలు ఇచ్చేవారు అధికారికంగా ఇచ్చేవారు కొందరైతే కొందరు ఎవరికీ తెలియకుండా, వారి పేరు బయటకు రాకుండా ఇస్తుంటారు. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు కూడా ఇలానే చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు ఆయన ఏకంగా రూ.2.1 కోట్ల విరాళాన్ని మూడు డీడీల రూపంలో అందించారు. ఆయన పేరు ఎక్కడా బయటకు రానివ్వలేదు.
Next Story

