Tue Mar 24 2026 00:30:20 GMT+0530 (India Standard Time)
కూకట్ పల్లిలో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ కూకట్ పల్లిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చైతన్య కళాశాలకు చెందిన ఓ బస్సు కూకట్ పల్లిలో రమ్య అనే ఇంటర్ విద్యార్థిని ఢికొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. వందల సంఖ్యలో విద్యార్థులు అక్కడికి చేరుకుని రోడ్డుపై ఆందోళనకు దిగారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 10 బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నారు.
Next Story

